నేడు పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:21 AM
పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ....
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో చూడవచ్చని నవీన్ నికోలస్ తెలిపారు. ఈనెల 5 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 31,542 మంది విద్యార్థులు హాజరయ్యారు.