Share News

జేఈఈ మెయిన్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:30 AM

జేఈఈ మెయిన్‌-2026 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ గురుకులం నుంచి 314 మంది..

జేఈఈ మెయిన్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌-2026 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ గురుకులం నుంచి 314 మంది ఈ పరీక్షకు హాజరుకాగా 69 మంది జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 9మంది విద్యార్థులు 90కంటే ఎక్కువ పర్సంటైల్‌, మరో 34 మంది 80 పర్సంటైల్‌కుపైగా స్కోరు సాధించారు. గణేష్‌ 95.88, సామ్రాట్‌ 95.25, శ్రీచక్ర 93.26 పర్సంటైల్‌ సాధించారు. విజయం సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు కూడా సత్తా చాటారు. 441 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 35 మంది విద్యార్థులు 90 పర్సంటైల్‌కుపైగా సాధించారు. సీవోఈ గౌలిదొడ్డికి చెందిన స్వరూప్‌ 98.92 పర్సంటైల్‌తో ఓబీసీ విభాగంలో 2036వ ర్యాంకు సాధించగా.. నిఖిల్‌ ఎస్సీ విభాగంలో 1097వ ర్యాంకు దక్కించుకున్నారు. 1000లోపు ముగ్గురు, 2000లోపు 8 మంది, 3000లోపు 13 మంది, 5000లోపు 34 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ విజయాల పట్ల సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 04:30 AM