Share News

సత్తా చాటిన సర్కారు బడి

ABN , Publish Date - May 02 , 2026 | 03:44 AM

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ ...

సత్తా చాటిన సర్కారు బడి

  • విశాఖ జిల్లా నడుపూరులో విజయోత్సవ ర్యాలీ

పెదగంట్యాడ (విశాఖపట్నం), మే 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించడంతో గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ పాఠశాలలో ఇమంది దేవిక 592 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్‌గా నిలవగా.. ఇంకా పి.పల్లవి 588 మార్కులు, లోకేశ్‌ 587 మార్కులు సాధించారు. నడుపూరు పాఠశాల నుంచి 354 మంది పరీక్షలకు హాజరుకాగా, 269 మంది (76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 65 మంది 500కుపైగా మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గురువారం పెదగంట్యాడ నిర్వాసిత కాలనీల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కారులో ఊరేగించారు.

Updated Date - May 02 , 2026 | 03:44 AM