శ్రీచైతన్యకు రికార్డు స్థాయి ఫలితాలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:01 AM
పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించినట్లు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 597 మార్కులతో శ్రీచైతన్య విద్యార్థి అగ్రస్థానం...
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డు సృష్టించినట్లు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 597 మార్కులతో శ్రీచైతన్య విద్యార్థి అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు. 829 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని, 2,303 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 3,954 మంది విద్యార్థులు 560కి పైగా మార్కులు, 5,521 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించినట్లు వెల్లడించారు. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 11,302 మంది, సెకండ్ లాంగ్వేజ్‌లో 12,380 మంది, ఇంగ్లి్‌షలో 13,821 మంది, గణితంలో 12,226 మంది, సామాన్య శాస్త్రంలో 13,273 మంది, సాంఘికశాస్త్రంలో 14,737 మంది విద్యార్థులు ఏ- గ్రేడు సాధించినట్లు తెలిపారు. మొత్తం 77,739 మంది విద్యార్థులు ఏ- గ్రేడు సాధించినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా సీమ అభినందించారు.