Share News

బట్టీ చదువులకు మేం వ్యతిరేకం

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:26 AM

విద్యార్థులతో రాత్రింబవళ్లు బట్టీలు పట్టించి ర్యాంకులు సాధిస్తున్నారంటూ తమను కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాము బట్టీ చదువులకు...

బట్టీ చదువులకు మేం వ్యతిరేకం

  • శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ సుష్మా బొప్పన

  • జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లకు సన్మానం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘విద్యార్థులతో రాత్రింబవళ్లు బట్టీలు పట్టించి ర్యాంకులు సాధిస్తున్నారంటూ తమను కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాము బట్టీ చదువులకు వ్యతిరేకమని శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌, సీఈవో సుష్మా బొప్పన అన్నారు. బట్టీతో మార్కులు సాధించవచ్చేమో కానీ.. జాతీయస్థాయిలో నెంబర్‌ వన్‌ ర్యాంకులు సాధించలేరని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక, అత్యుత్తమ నిపుణుల బోధన, క్రమశిక్షణతోనే తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తున్నారని చెప్పారు. జేఈఈ మెయిన్‌లో జాతీయస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్‌ సీమా బొప్పనతో కలిసి హైదరాబాద్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడారు. జేఈఈ ఫలితాల్లో నలుగురు మాత్రమే 300/300 మార్కులు సాధించగా.. వీరిలో తమ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారన్నారు. బీవీసీ.శేఖర్‌ రెడ్డి, పసల మోహిత్‌ ఓపెన్‌ క్యాటగిరీలో జాతీయస్థాయిలో నెంబర్‌-1 ర్యాంకులు సాధించగా, ఆరుష్‌ సింఘాల్‌, యష్‌వర్ధన్‌, మణిదీప్‌రెడ్డి 8, 11, 15వ ర్యాంకులను కైవసం చేసుకున్నారన్నారు. మొత్తం 26మందిలో తమ విద్యాసంస్థలకు చెందిన ఏడుగురు వంద పర్సంటైల్‌ సాధించగా, టాప్‌-100లో 11మంది, టాప్‌-1000 లోపు 166 ర్యాంకులు సాధించామన్నారు. మరో డైరెక్టర్‌ సీమా బొప్పన మాట్లాడుతూ.. తమ విద్యార్థులు వరుసగా నాలుగో ఏడాది 300/300 మార్కులు సాధించారన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 04:26 AM