ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఎస్సార్ స్కూల్ విజయభేరి
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:54 AM
ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి విజయకేతనం ఎగుర వేసినట్లు ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు.
హసన్‌పర్తి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి విజయకేతనం ఎగుర వేసినట్లు ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాల్లో సి.సంస్కృతరెడ్డి 589, పి.రంజీ వంశీ 588, ఎస్.కీర్తన587, అంకం సౌజన్య 587, ఎ.సంజయ్ 586, టి.వైష్ణవి 585, బిశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇంకా 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఎస్సార్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ విద్యా సంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.