Satyajit Ray Film & TV Institute: సత్యజిత్ రే లో పీజీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:23 AM
సినిమాలో విద్యకు సంబంధించి దేశంలోనే రెండో ప్రముఖ విద్యాసంస్థ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(ఎ్‌సఆర్‌ఎ్‌ఫటీఐ). 1995 ఏర్పాటైన ఈ సంస్థకు స్వతంత్రప్రతిపత్తి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సినిమాలో విద్యకు సంబంధించి దేశంలోనే రెండో ప్రముఖ విద్యాసంస్థ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(ఎ్‌సఆర్‌ఎ్‌ఫటీఐ). 1995 ఏర్పాటైన ఈ సంస్థకు స్వతంత్రప్రతిపత్తి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మూడేళ్ళ కాలవ్యవధి(ఒక ఏడాది బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌తో కలిసి) కలిగిన మాస్టర్ట్స్ సినిమా కోర్సులో ఆరు స్పెషలైజేషన్లు - డైరెక్షన్ అండ్ స్ర్కీన్‌ప్లే రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్, ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, యానిమేషన్ సినిమా ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌లో 12 సీట్లు ఉన్నాయి.
రెండేళ్ళ కాలవ్యవధి కలిగిన ఎలకా్ట్రనిక్ అండ్ డిజిటల్ మీడియా(ఈడీఎం) మాస్టర్ట్స్ కోర్సులు కూడా ఆరు స్పెషైజేషన్లు- మేనేజ్‌మెంట్, రైటింగ్, డైరక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్‌లో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌లో 7 సీట్లు ఉన్నాయి.
ఇటానగర్ క్యాంప్‌సలో కోర్సులు: దీని ప్రాస్పెక్టస్ వేరుగా విడుదలైంది. ఇక్కడ అందించే రెండేళ్ళ పీజీ డిప్లొమా కోర్సులు - స్ర్కీన్ యాక్టింగ్(20 సీట్లు), స్ర్కీన్‌రైటింగ్(20 సీట్లు), డాక్యుమెంటరీ సినిమా(10 సీట్లు) ఉన్నాయి.
ఎంపిక: మొదటి దశలో 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జనరల్ అప్టిట్యూడ్, కామన్ సబ్జెక్ట్ ఏరియా నుంచి చెరి 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. రెండో దశలో 100 మార్కులకు అసెస్‌మెంట్ - రాత/ ప్రాక్టికల్/ ఇంటరాక్షన్ టెస్ట్ ఉంటుంది. రాత, ప్రాక్టికల్ రెండూ కూడా ఉండొచ్చు.
అర్హత: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత
రాత పరీక్ష: ఫిబ్రవరి 22(హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతుంది)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 4
వెబ్‌సైట్: https://srfti.ac.in/postgraduateprogrammesatftiar/#