Share News

ఐటీలో కొత్త కొలువు డిప్లాయిడ్‌ ఇంజనీర్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 06:22 AM

ఫీల్డ్‌, సైట్‌లో లేదంటే కస్టమర్‌ను నేరుగా ఎదుర్కొనే వ్యక్తి డిప్లాయిడ్‌ ఇంజనీర్‌. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ సంబంధ విషయాల్లో వీరి అవసరం పెరుగుతోంది.

ఐటీలో కొత్త కొలువు డిప్లాయిడ్‌ ఇంజనీర్‌

సాంకేతిక పురోగతితో ఉన్న ఉద్యోగాలు ఊడటమే కాదు, కొత్తవి పుట్టుకువస్తున్నాయి. ఐటీ రంగంలో సరికొత్తగా ఉనికిలో వచ్చిన ఉద్యోగాల్లో ఒకటి డిప్లాయిడ్‌ ఇంజనీర్‌. దీని సంగతేమిటో తెలుసుకుందాం.

ఫీల్డ్‌, సైట్‌లో లేదంటే కస్టమర్‌ను నేరుగా ఎదుర్కొనే వ్యక్తి డిప్లాయిడ్‌ ఇంజనీర్‌. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ సంబంధ విషయాల్లో వీరి అవసరం పెరుగుతోంది. ఫిక్సింగ్‌ నుంచి ఆర్కిటెక్టింగ్‌ ట్రస్ట్‌ అంటే విశ్వాసాన్ని ప్రోదిచేసే పనిగా డిప్లాయిడ్‌ ఇంజనీర్‌ పాత్ర మారింది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కస్టమర్‌ విశ్వాసాన్ని పెంపొందించే పనిని ఈ ఇంజనీర్లు చేపట్టాలి. ఒకరకంగా వీరు ట్రబుల్‌ షూటర్లు. ప్యాచింగ్‌, లాగ్‌ అనాల్సిస్‌, కాన్ఫిగరేషన్‌ పనులు యధావిధిగా జరుగుతూ ఉంటాయి. పటిష్టమైన ఏఐ పైప్‌లైన్స్‌ డిజైనింగ్‌, మూల్యాంకనతో వాటిని ఎప్పటికప్పుడు సరిచేయడమే వీరి పని. భవిష్యత్తులో వీరు కస్టమర్‌కు చెందిన ఎల్‌ఎల్‌ఎమ్‌-పవర్డ్‌ యాప్‌ డేటా లీకేజీ లేదా మోడల్‌ పాయిజినింగ్‌ను ఆరికట్టాల్సి ఉంటుంది.

  • ఏఐ ఏజెంట్లను బృందంలోని సభ్యులుగా మలుచుకోవాలి. నెట్‌వర్క్‌ల సమన్వయానికి తోడు ఫిక్స్‌లను సూచించే పనిని సైబర్‌సెక్యూరిటీ, ఏఐ ఏజెంట్లు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే లోటుపాట్లను కనిపెట్టి వాటిని సరిచేయడం డిప్లాయిడ్‌ ఇంజనీర్ల పని. తప్పులను కనుగొనడం నుంచి సరిదిద్దడం వరకు అంతా వీరి పనే. అందులో భాగంగా ఏఐ జనరేటెడ్‌ నిర్ణయాలను కస్టమర్లకు తెలియజేయాలి. ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఈ పని చాలా అవసరమవుతూ ఉంటుంది. ఏఐ సిఫార్సులు ఏ సందర్భంలో పనిచేయవో గుర్తించడమే కాదు, కస్టమర్లకు వాటిని వివరంగా తెలియజేయగలిగే నైపుణ్యాన్ని పొందాలి.

  • జీరో-ట్రస్ట్‌ ఎన్‌ఫోర్సర్లుగా మారాలి. అంటే సైబర్‌ భద్రతలో ఎవరినీ డిఫాల్ట్‌గా నమ్మకూడదు. ప్రతి యూజర్‌, పరికరం లేదా డేటాను నిరంతరం ధ్రువీకరించే సాధనాలను, విధానాలను రూపొందించగలగాలి. కస్టమర్‌ హార్డ్‌ వేర్‌లో కాన్ఫిడెన్షియల్‌ కంప్యూటింగ్‌ను రంగంలోకి దింపాలి. ఫెడరేటెడ్‌ లెర్నింగ్‌ సెక్యూరిటీ అంటే డేటాను ఒకే చోట ఉంచకూడదు, వికేంద్రీకరించాలి. శిక్షణ పొందిన ఏఐ నమూనాల సహాయంతో మోసపూరిత సమాచారాలను నిరోధించాలి. ట్రిటాన్‌, టెన్సర్‌ఫ్లో సెర్వింగ్‌ ఇందుకు ఉపయోగడపడతాయి.


  • ఏఐతో కలిగే రిస్క్‌ను అరికట్టేందుకు సైబర్‌సెక్యూరిటీ స్కిల్స్‌ అవసరమవుతాయి. అందుకోసం రెడ్‌ టీమ్‌ ఏఐ మోడల్స్‌ను రూపొందించాలి. ఈయూ ఏఐ యాక్ట్‌, ఎన్‌వైడిఎ్‌పఎస్‌తో ఏఐ సిస్టమ్‌ ఆడిటింగ్‌ చేపట్టేలా చూడాలి.

  • ఈ క్రమంలో ఫీల్డ్‌ ఇంజనీర్‌ కాస్తా ఏఐ ట్రస్ట్‌ ఆర్కిటెక్ట్‌గా మారుతారు. మరో రెండేళ్ళలో ఆన్‌ ప్రీమియమ్‌ ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్‌, ఎడ్జ్‌ మోడల్‌ ఇంటెగ్రిటీ స్పెషలిస్ట్‌, డిప్లాయిడ్‌ ఏఐ రెడ్‌ టీమ్‌ లీడ్‌గా రూపాంతరం చెందాల్సి ఉంటుంది.

నైపుణ్యాలు

  • ఈ రంగంలో దూసుకుపోవాలంటే, ఏఐ సెక్యూరిటీ టూల్స్‌ - గరక్‌(ఎల్‌ఎలెం వల్నరబిలిటీ స్కానర్‌) రీబ్‌ఫ (ప్రాంప్ట్‌ ఇంజెక్షన్‌ డిటెక్టర్‌), కాన్ఫిడెన్షియల్‌ కంటైనర్స్‌ (కాటా + టీ) నేర్చుకోవాలి.

  • ఆన్‌ ప్రీమియమ్‌ ఏఐ స్టాక్‌ - నివిడియా ఎఐ ఎంట్రప్రైజ్‌, రెడ్‌ హ్యాట్‌ ఓపెన్‌షిప్ట్‌ ఏఐ, హగ్గిం ఫేస్‌ టెక్స్ట్‌ జనరేషన్‌ ఇన్ఫెరెన్స్‌లో ఒకదానిలో మాస్టర్‌ చేయాలి.

  • ఏఐలో సెక్యూరిటీ సర్టిఫికేషన్‌ - సీసీఎ్‌సకే(క్లౌడ్‌ ఏఐ రిస్క్స్‌), ఏడబ్ల్యుఎస్‌ సెక్యూరిటీ స్పెషాలిటీ(జనరేటివ్‌ ఏఐ సెక్యూరిటీ) లేదా సరికొత్తదైన మిట్రెట్లాస్‌ ఫ్రేమ్‌వర్క్‌ చేయాలి. తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి.

  • ఇంజనీర్‌ పాత్ర ఏమి తొలగిపోలేదు, ఎలివేట్‌ అయ్యింది. ఆటోమేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ అలాగే ఆపరేషనల్‌ ట్రస్ట్‌లో ఏఐ, సెక్యూరిటీ స్కిల్స్‌కు సంబంధించి డిప్లాయిడ్‌ ఇంజనీర్‌ అటు కస్టమర్‌కు ఇటు కంపెనీకి వారధిగా మారుతాడు. ప్రధానంగా డిఫెన్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌, నియంత్రిత ఫైనాన్స్‌ రంగంలో డిప్లాయిడ్‌ ఇంజనీర్లకు డిమాండ్‌ రాన్రాను పెరిగే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు.

ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావు

డైరెక్టర్‌, ఎన్‌ఐటీ, రాయ్‌పూర్‌

Updated Date - Jun 29 , 2026 | 06:23 AM