నీట్ రీఎగ్జామ్ ప్రొవిజనల్‘కీ’ విడుదల
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:52 AM
దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించిన నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రొవిజనల్ కీ గురువారం విడుదలైంది....
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించిన నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రొవిజనల్ కీ గురువారం విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ‘కీ’ని అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. ‘కీ’లో ఏవైనా తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు భావిస్తే.. ఈ నెల 28వ తేదీ రాత్రి 11:50 గంటల లోపు ఆన్‌లైన్ ద్వారా వాటిని సవాలు చేసే అవకాశం కల్పించింది. ప్రతి అభ్యంతరానికి రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ నిర్థారిస్తే.. ఆ ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది. సందేహాల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 011-40759000ను సంప్రదించాలని ఎన్‌టీఏ సూచించింది.