సత్తా చాటిన నారాయణ విద్యార్థులు
ABN , Publish Date - May 18 , 2026 | 03:19 AM
తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో బి.అన్షుల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా..
హైదరాబాద్ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో బి.అన్షుల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించగా.. ఆదుల సాయినిఖిత్ 5వ ర్యాంకు, మల్లవరపు అస్నా 6వ ర్యాంకు), వివాన్ శరధ్ మహేశ్వరి 7వ ర్యాంకు, తాళ్లూరి శ్రేయాస్ రెడ్డి 8వ ర్యాంకు సాధించి ప్రతిభను చాటారు. టాప్‌లో 10లో 5 ర్యాంకులు, టాప్ 100లో 51 ర్యాంకులు, 500లోపు 242, 1000 లోపు 439 ర్యాంకులు తమ విదార్థులు సాధించినట్లు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి. సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు. అగ్రి అండ్ ఫార్మసీ విభాగాల్లోనూ100లోపు 9 ర్యాంకులు సాధించడం మెడికల్ ప్రోగ్రామ్‌పై నారాయణ విద్యాసంస్థలకు ఉన్న పట్టుని రుజువు చేసిందన్నారు.