Share News

పదో తరగతి ఫలితాల్లో నారాయణ హవా

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:00 AM

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూళ్లు చరిత్ర సృష్టించాయని నారాయణ గ్రూప్స్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో నారాయణ హవా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో నారాయణ స్కూళ్లు చరిత్ర సృష్టించాయని నారాయణ గ్రూప్స్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సింధూర నారాయణ, పి. శరణి నారాయణ తెలిపారు. బుధవారం పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 600 మార్కులకు 597 మార్కులు సాధించిన విద్యార్థులు నలుగురు ఉండగా.. వారిలో ఒకరు(మేథాన్స్‌ శ్రీరామ) నారాయణ విద్యార్థేనని తెలిపారు. జంట నగరాల్లో 597 మార్కులు సాధించిన ఒకేఒక్కరు నారాయణ విద్యార్థేనని చెప్పారు. 84 బ్రాంచిల్లో 100ు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్ని సబ్జెక్టుల్లో ఏ- గ్రేడు సాధించిన విద్యార్థులు 44,222 మంది ఉన్నట్లు తెలిపారు. 597 మార్కులు సాధించిన మేథాన్స్‌ శ్రీరామ, 596 మార్కులు సాధించిన కె.శోభిత, ఎం. చంద్రహాస్‌, టి. నిశ్చయ్‌ ప్రణవ్‌, కె. లలిత్‌లను ఈ సందర్భంగా వారు అభినందించారు.

Updated Date - Apr 30 , 2026 | 05:00 AM