Share News

Nursing Posts: నర్సింగ్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:52 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇటీవలే 1,257 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసిన మెడికల్‌ ..

Nursing Posts: నర్సింగ్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

  • 1-1-5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

  • ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు సర్టిఫికెట్ల పరిశీలన

  • అనంతరం తుది జాబితా విడుదల..

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇటీవలే 1,257 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసిన మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2,322 నర్సింగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్‌ లిస్టును శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతీ అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతర వివరాలను మెడికల్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. మొత్తం 2,322 పోస్టులకు గాను 1-1-5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్నవారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7 వరకు సర్టిఫికెట్‌ల పరిశీలన నిర్వహించనున్నారు. అనంతరం ఎంపికైనవారిజాబితాను విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌ వెంగళరావు నగర్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌’ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిశీలనకు రావాలనే వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని బోర్డు సూచించింది. 2024లో 6,956 నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేసిన సర్కారు.. తాజాగా ఈ పోస్టుల భర్తీతో సర్కారీ దవాఖానాల్లో నర్సుల కొరత దాదాపు తీరిపోనుంది.

Updated Date - Jan 18 , 2026 | 04:52 AM