డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థుల హవా
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:21 AM
సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్-2026 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు పి.మోహిత్, జి. చంద్రశేఖర్‌రెడ్డి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో...
హైదరాబాద్, ఏప్రిల్ 20 : సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్-2026 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు పి.మోహిత్, జి. చంద్రశేఖర్‌రెడ్డి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకులు(1వ ర్యాంకు) సాధించి సంచలనం సృష్టించారు. అలాగే ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఎం. రామ సంతోష్ 62వ ర్యాంకు, పి.చెన్న కేశవ్ 83వ ర్యాంకులు సాధించారు. అలాగే డా.కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆలిండియాలో మొదటి 100లోపు వివిధ కేటగిరీల్లో 1, 1, 7, 8, 23, 24, 26, 34, 50, 62, 68, 71, 82, 83, 94 వంటి 15 ర్యాంకులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి సంస్థ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.