కేశవరెడ్డి విద్యార్థుల విజయ విహారం
ABN , Publish Date - May 01 , 2026 | 04:45 AM
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మరే ఇతర విద్యాసంస్థకు సాధ్యం కాని రీతిలో నాలుగు ేస్టట్ టాప్ 597 మార్కుల్లో రెండింటిని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన కేశవ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్....
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మరే ఇతర విద్యాసంస్థకు సాధ్యం కాని రీతిలో నాలుగు ేస్టట్ టాప్ 597 మార్కుల్లో రెండింటిని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన కేశవ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. తమ విద్యార్థులు జె.అభిషక్త్ 597 మార్కులు, యం.ఆఫషీన్ ఫాతిమ 597 మార్కులు, బి.మోహిత్ రెడ్డి, యం.ప్రణీత, తనూజ చిత్ర, యం.హారిక, పి.లక్ష్మీ సౌమ్య, యు.సాఫియా ఫలిక్, ఎ.వెంకట ఫణీంద్ర రెడ్డి 596 మార్కులు సాధించి మరోసారి కేశవరెడ్డి విద్యాసంస్థల ఆధిక్యతను చాటారని ఫౌండర్ చైర్మన్ ఎన్.కేశవ రెడ్డి తెలిపారు. 595 ఆపైగా మార్కులు 11 మంది, 594 ఆపైగా 18 మంది, 593 ఆపైగా 29 మంది, 592 ఆపైగా 36 మంది, 591 ఆపైగా 46 మంది, 590 ఆపైగా మార్కులు 50 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు. నిరంతర శ్రమ, 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టట్ కరికులంతో కూడిన విధానాలను అనుసరించడం తమ విజయ రహస్యాలని చెప్పారు. ఈ ఘన విజయంలో పాలు పంచుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కేశవరెడ్డి అభినందనలు తెలిపారు.