Share News

కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:57 AM

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు చైర్మన్‌ ఎన్‌. కేశవరెడ్డి తెలిపారు.

కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు చైర్మన్‌ ఎన్‌. కేశవరెడ్డి తెలిపారు. మధు, శశాంక్‌ అనే ఇద్దరు విద్యార్థులు 597 మార్కుల చొప్పున సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. శ్రీనిధిత, జి. వర్షిణి 594, కె. త్రిపుర, కె. సాత్విక 592, టి. వర్షిణి, జి. మల్లేశం. పి. శరణ్య 591, జి. శ్రుతిక 590, యం. ఫరాన్‌, బి. సాయిచరణ్‌, శ్రీసాయి శ్రీకాంత్‌, యషశ్రీ, ఎన్‌. దినేశ్‌ 589, యం. అరుణ్‌ 588 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. లాంగ్వేజె్‌సలో సగటున 84 శాతం మార్కులు, గ్రూప్స్‌లో 87 శాతం మార్కులు తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ప్రతి విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, కేవలం టాపర్స్‌ను మాత్రమే కాకుండా.. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. ఇందువల్లనే తమ పూర్వ విద్యార్థులు కేవలం డాక్టర్లు, ఇంజనీర్లుగానే కాకుండా ఐఏఎస్‌, ఐపీఎస్‌, న్యాయమూర్తులుగానూ, మరెన్నో ఇతర గౌరవప్రదమైన హోదాలలో రాణిస్తున్నారన్నారు. రానున్న విద్యా సంవత్సరాలలో తమ విద్యార్థులు మరిన్ని ఘన విజయాలు సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, అందుకు తోడ్పడిన అధ్యాపకులను కేశవరెడ్డి అభినందించారు.

Updated Date - Apr 30 , 2026 | 04:57 AM