జేఈఈ మెయిన్స్‌లో ఆదిత్యకు ఉత్తమ ర్యాంకులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:00 AM
జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్ రెడ్డి తెలిపారు.
కాకినాడ రూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్ రెడ్డి తెలిపారు. బి.శ్రీరామ్ ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 88వ ర్యాంకు, ఎన్‌ఎ్‌సఎస్ వైభవ్ 90వ ర్యాంకు, అదేవిధంగా జి.శ్రీజన్ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు, శ్రీరామ్ 15, ఎమ్.రామ్‌జీ అంబేడ్కర్ 16వ ర్యాంకు, వీవీఎ్‌సఎస్ రాఘవరావు 22, ఎన్‌ఎ్‌స.సాయి వైభవ్ 90, ఎన్.నిఖిల ప్రణవి 95, కేవీ సూర్య చరణ్ 111, దేవరపు సురేంద్ర 119వ ర్యాంకులతో పాటు 120, 127, 134 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారన్నారు. అంతేకాకుండా 150లోపు 13 మంది, 1000లోపు 41 మంది, 5000లోపు 87 మంది ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. ప్రతిభ కనబరచి అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులు, అధ్యాపకులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి, కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్ రెడ్డి, హాస్టల్స్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ప్రిన్సిపాల్ మొయినా అభినందించారు.