JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్.. ఇక ఈజీ!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:02 AM
ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ- అడ్వాన్స్‌డ్ పరీక్ష విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఐఐటీ కౌన్సిల్ కీలక సిఫారసులు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 7: ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ- అడ్వాన్స్‌డ్ పరీక్ష విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఐఐటీ కౌన్సిల్ కీలక సిఫారసులు చేసింది. అభ్యర్థుల సామర్థ్యం ఆధారంగా పరీక్షలో మార్పులు చేయాలని సూచించింది. దీని ప్రకారం.. ప్రశ్నలను డైనమిక్‌గా రూపొందించడంతోపాటు నిర్ణీత సమయంలో జవాబు రాసేలా ప్రశ్న పత్రాలను రూపొందిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ ఏడాది నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ముందు ప్రయోగాత్మక ఐచ్ఛిక పరీక్షను నిర్వహించాలని కౌన్సిల్‌లోని నిపుణుల బృందం సిఫారసు చేసింది. ఈ ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పరీక్షలకు ఏ విధమైన రోడ్‌మ్యా్‌పను రూపొందించవచ్చనేది స్పష్టమవుతుందని పేర్కొంది. అదేవిధంగా ఐఐటీలలో మానసిక ఆరోగ్య నిపుణులను నియమించేందుకు మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, ఐఐటీలలో అందిస్తున్న ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల పాఠ్యాంశాలను సమూలంగా మార్చాలని ఐఐటీ కౌన్సిల్ నిర్ణయించింది.