Share News

ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:07 AM

ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల చేసినట్లు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు..

ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల చేసినట్లు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపాళ్ల నుంచి వీటిని పొందవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి హాల్‌ టికెట్‌పై పరీక్ష కేంద్రం చిరునామా సూచించే క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించామని తెలిపారు. విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా లింక్‌ పంపామని, మొబైల్‌ నుంచి కూడా హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 02:07 AM