ఏప్రిల్ 5 తర్వాత ఇంటర్ ఫలితాలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:37 AM
ఇంటర్ పరీక్షలు ముగియడంలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది...
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ పరీక్షలు ముగియడంలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈనెల 25 నాటికి మూల్యాంకనం పూర్తిచేసి, ఏప్రిల్ 5 తర్వాత ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జూన్ 1నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను కూడా ముగించి ఫలితా లు ప్రకటించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, ఇంటర్ బోర్డు లో ప్రిన్సిపాళ్ల పదోన్నతుల ప్రక్రియ సోమవారం పూర్తయింది. 2008లో జేఎల్‌గా చేరి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న 48 మందికి అధికారులు పదోన్నతులు కల్పించారు.