Share News

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:12 AM

విధ విభాగాల్లో ఉన్న 3,979 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రమోట్‌ చేసే చర్యలో భాగంగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో

యంత్ర ఇండియా లిమిటెడ్‌ - వివిధ విభాగాల్లో ఉన్న 3,979 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రమోట్‌ చేసే చర్యలో భాగంగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్‌ ఆర్డినెన్స్‌, ఆర్డినెన్స్‌ ఎక్వి్‌పమెంట్‌ ఫ్యాక్టరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వాటిలో ఏదైనా ఒక్కదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల సంఖ్య తాత్కాలికం.

నలంద(బిహార్‌), జబల్‌పూర్‌, ఇటార్సీ, కట్నీ (మధ్యప్రదేశ్‌), పుణె, థానె, బాంద్రా, భూస్వాల్‌, చంద్రాపూర్‌, వరంగాన్‌, కిర్కీ, నాగపూర్‌(మహారాష్ట్ర), బొలంగీర్‌ (ఒడిషా), ఆవడి, తిరుచ్చిరాపల్లి (తమిళనాడు), మురద్‌నగర్‌, కాన్పూర్‌, షాజన్‌పూర్‌, హజరత్‌పూర్‌(యూపీ), డెహ్రాడూన్‌(ఉత్తరాఖండ్‌), కోల్‌కతా, ఇషాపూర్‌, కాశీపూర్‌(పశ్చిమబెంగాల్‌), చండీగఢ్‌లలో ఉన్న ఫ్యాక్టరీల్లో వేకెన్సీలు ఉన్నాయి.

విభాగాలు: మెషినిస్ట్‌, ఫిట్టర్‌ ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌

పోస్టులు: ఎక్స్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌(2843 ఖాళీలు) - కనీసం 50 శాతం(మ్యాథ్స్‌, సైన్స్‌లో కలిపి 50 శాతం) మార్కులతో టెన్త్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత నాన్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌(1136 ఖాళీలు)-పైన నిర్దేశించిన విధంగా టెన్త్‌కు తోడు కనీసం 50 శాతం మార్కులతో ఐటీఐ ట్రేడ్‌ ఉత్తీర్ణత

వయస్సు: ఈ ఏడాది మార్చి 3నాటికి 14-35సంవత్సరాలు

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 3

వెబ్‌సైట్‌: : www.apprenticeship.gov.in, https://recruitgov.com.

Updated Date - Feb 23 , 2026 | 03:12 AM