Indian Navya: ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:21 AM
ఇండియన్ నేవల్ అకాడమీ(కేరళ రాష్ట్రం ఎజిమల) 260 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అవివాహితులైన మహిళలు, పురుషులు అర్హులు. ఎంపికైన వారికి 2027 జనవరి నుంచి శిక్షణ ఆరంభమవుతుంది.

పోస్టులు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(జీఎ్‌స(ఎక్స్)/ హైడ్రో కేడర్) - 76, పైలట్ -25, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్స్) -20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 18, లాజిస్టిక్స్ - 10, ఎడ్యుకేషన్ - 15, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్) - 42, సబ్‌మెరైన్ టెక్ ఇంజనీరింగ్ - 08, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్) - 38, సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ - 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 24
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in/