క్రాఫ్ట్స్ అండ్ డిజైన్‌లో కోర్సులు
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:52 AM
క్రాఫ్ట్స్ అలాగే డిజైన్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఐఐసీడీ. ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ దీని పూర్తి స్వరూపం
క్రాఫ్ట్స్ అలాగే డిజైన్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఐఐసీడీ. ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ దీని పూర్తి స్వరూపం. స్వతంత్రప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో పీపీపీ మోడల్‌లో 2007 నుంచి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సులు: స్పెషలైజేషన్స్(హార్డ్ మెటీరియల్ డిజైన్, సాఫ్ట్ మెటీరియల్ డిజైన్, ఫైర్డ్ మెటీరియల్ డిజైన్, ఫ్యాషన్ క్లాతింగ్ డిజైన్, జ్యువెలరీ డిజైన్, క్రాఫ్ట్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్)
బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్: నాలుగేళ్ళు - ఎనిమిది సెమిస్టర్లు - పై స్పెషలైజేషన్లలో అన్నింటిలో కలిపి 180 సీట్లు - ఇంటర్ లేదా తత్సమా పరీక్ష ఉత్తీర్ణులు ఉత్తీర్ణత.
మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్: రెండేళ్ళు - నాలుగు సెమిస్టర్లు - పై స్పెషలైజేషన్లలో అన్నింటిలో కలిపి 60 సీట్లు - డిజైన్/ ఆర్కిటెక్చర్‌తో డిగ్రీ ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా ఇన్ డిజైన్ ఫౌండేషన్: ఒక ఏడాది కోర్సు - 20 సీట్లు - ఏ డిసిప్లిన్‌లో అయినా డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, వాట్సాప్ వీడియో కాల్‌తో పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 31
వెబ్‌సైట్: https://www.iicd.ac.in/