Share News

గ్రామీణ బ్యాంకులు

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:40 AM

తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ గ్రామీణ బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ సహా దేశవ్యాప్తంగా వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 13,700కి పైగా ఖాళీగా ఉన్న ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ పోస్టులకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఖాళీలు: 13,700

పోస్టుల వివరాలు: ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌), ఆఫీసర్‌ - వివిధ స్కేల్స్‌ పరిధిలో(అసిస్టెంట్‌ మేనేజర్‌, జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌, ఐటీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, లా, ట్రెజరీ మేనేజర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, సీనియర్‌ మేనేజర్‌.

అర్హత: పోస్టును అనుసరించి సాధారణ డిగ్రీ, లా లో డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాత పరీక్షలకు తోడు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా(ఆఫీసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.) మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్‌ చూడవచ్చు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 21

వెబ్‌సైట్‌: www.ibps.in

Updated Date - Sep 07 , 2026 | 05:43 AM