Share News

గతి శక్తి విశ్వవిద్యాలయ్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:07 AM

ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఉన్నత విద్యా సంస్థ గతి శక్తి విశ్వవిద్యాలయ్‌(జీఎస్వీ). పార్లమెంట్‌ రూపొందించిన ప్రత్యేక చట్టం ఆధారంగా ...

గతి శక్తి విశ్వవిద్యాలయ్‌

ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఉన్నత విద్యా సంస్థ గతి శక్తి విశ్వవిద్యాలయ్‌(జీఎస్వీ). పార్లమెంట్‌ రూపొందించిన ప్రత్యేక చట్టం ఆధారంగా గుజరాత్‌లోని వడోదరలో ఇది ఏర్పాటైంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ నిర్దేశిత కరికులమ్‌ను ఇక్కడ అనుసరిస్తారు. రైల్వేకు చెందిన సెంట్రలైజ్డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన మౌలిక సదుపాయాలను ఈ సంస్థ ఉపయోగించుకుంటోంది. మొత్తమ్మీద భారత రైల్వే మంత్రిత్వశాఖ ప్రాయోజిత సెంట్రల్‌ వర్సిటీగా అలరారుతోంది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

కోర్సులు:

  • బీటెక్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌(ఈ నాలుగు కోర్సుల్లో స్పెషలైజేషన్‌గా రైల్‌ ఇంజనీరింగ్‌ ఉంది), ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సైన్స్‌(స్పెషలైజేషన్‌ - ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌) - ఒక్కో దానిలో 60 సీట్లు ఉన్నాయి.

  • బీటెక్‌ ఇన్‌ ఏవియేషన్‌ ఇంజనీరింగ్‌ - 40 సీట్లు, మారిటైమ్‌ ఇంజనీరింగ్‌ - 30 సీట్లు ఉన్నాయి.

  • పీజీ - ఎంబీఏ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ - 30 సీట్లు, ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీతో కలిసి అందిస్తున్న మరో కోర్సు ఎంబీఏ ఇన్‌ పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ లాజిస్టిక్స్‌ - 30 సీట్లు

  • ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌లో ఇంజనీరింగ్‌ అలాగే మేనేజ్‌మెంట్‌ పరిధిలో వేర్వేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఇవేకాకుండా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం మరికొన్ని పీజీ కోర్సులను కూడా అందిస్తోంది.

  • జేఈఈ మెయిన్‌ 2026 స్కోర్‌ ఆధారంగా జోసా/ సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఈ వర్సిటీ అందించే బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

  • సీయూఈటీ-పీజీ/ ఎక్‌ఏటీ/ క్యాట్‌/ మ్యాట్‌ - ఐఎంయు-సెట్‌ స్కోర్‌కు తోడు మరికొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఎంబీఏ సీట్లు లభిస్తాయి.

వెబ్‌సైట్‌: https://gsv.ac.in

Updated Date - Apr 06 , 2026 | 06:07 AM