గేట్-2026 ఫలితాల విడుదల
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:56 AM
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026 ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి....
ఫిబ్రవరిలో జరిగిన పరీక్షల ఫలితాలను
వెల్లడించిన ఐఐటీ గువాహటి
అభ్యర్థులు 27 నుంచి స్కోర్‌కార్డుల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ, మార్చి 19: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026 ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి. ఐఐటీ గువాహటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం వెల్లడించారు. దీంతో లక్షలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించినట్లయింది. అభ్యర్థులు జీవోఏపీఎస్ పోర్టల్‌లో లాగిన్ అయి, వారు సాధించిన మార్కులు, ఆలిండియా ర్యాంకు, వారికి సంబంధించిన పేపర్‌లో అర్హత స్థితిని తెలుసుకోవచ్చు. స్కోర్ కార్డులు ఈ నెల 27 నుంచి అందుబాటులో ఉంటాయని.. అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోపు తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. గేట్-2026 స్కోర్ కార్డులు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. వాటి ఆధారంగా అభ్యర్థులు పీజీ ప్రవేశాలు, ఉద్యోగ దరఖాస్తులు చేసుకోవచ్చు. గేట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు ఇంజనీరింగ్ అభ్యర్థులను కొలువులకు ఎంపిక చేసుకుంటాయి.