Share News

ఎఫ్‌డీడీఐ

ABN , Publish Date - Apr 06 , 2026 | 06:08 AM

సంబంధిత ఉత్పత్తులకు సంబంధించి విద్య, శిక్షణ, పరిశోధనకు ఉద్దేశించిన అత్యున్నత స్థాయి సంస్థ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌...

ఎఫ్‌డీడీఐ

పాదరక్షలు - సంబంధిత ఉత్పత్తులకు సంబంధించి విద్య, శిక్షణ, పరిశోధనకు ఉద్దేశించిన అత్యున్నత స్థాయి సంస్థ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ). హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ సంస్థకు క్యాంపస్‌లు ఉన్నాయి.

కోర్సులు: బీ.డిజెన్‌(ఫుట్‌వేర్‌, ఫ్యాషన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీ డిజైన్‌) బీబీఏ -1870 సీట్లు;

  • ఎం.డిజైన్‌(ఫుట్‌వేర్‌, ఫ్యాషన్‌) ఎంబీఏ - 510 సీట్లు

  • హైదరాబాద్‌ క్యాంపస్‌: బీబీఏ సహా బీ.డిజైన్‌ కోర్సులన్నీ ఉన్నాయి ఒక్కో దానిలో 60 చొప్పున మొత్తం 240 సీట్లు ఉన్నాయి. ఎం.డిజైన్‌ ఫ్యాషన్‌లో 30, ఎంబీఏలో 60 కలిపి 90 సీట్లు ఉన్నాయి.

  • బీ.డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష మే 10న హైదరాబాద్‌, విశాఖపట్టణం సహా దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్‌ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.fddiindia.com

Updated Date - Apr 06 , 2026 | 06:08 AM