Share News

కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:14 AM

కాఫీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లొమా ఇన్‌ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. మూడు ట్రై సెమిస్టర్లుగా ఈ కోర్సు ఉంటుంది.

కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌

కాఫీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లొమా ఇన్‌ కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. మూడు ట్రై సెమిస్టర్లుగా ఈ కోర్సు ఉంటుంది.

  • కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ట్రైసెమిస్టర్‌ సమయంలో ఉచిత వసతిని బెలెహోనూర్‌(చిక్‌మగళూరు)లోని సీసీఆర్‌ఐలో కల్పిస్తారు.

  • బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోసైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో కనీసం ఒక సబ్జెక్టుతో లేదా అగ్రికల్చరల్‌ సైన్సెస్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

  • అకడమిక్‌ రికార్డ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సెన్సరీ ఎవాల్యుయేషన్‌ టెస్ట్‌ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌ రెండో లేదా మూడో వారంలో ఇంటర్వ్యూలు ఉంటాయి.

  • కోర్సు ఫీజు రెండున్నర లక్షలు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌ ఐడి: hdqccoffeboard@gmail.com

వెబ్‌సైట్‌: coffeboard.gov.in

Updated Date - Sep 07 , 2026 | 05:19 AM