Share News

నేడు డిన్నర్‌ విత్‌ విన్నర్స్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:22 AM

బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025 అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు విందు భేటీ నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన అవార్డు రాష్ట్రానికి...

నేడు డిన్నర్‌ విత్‌ విన్నర్స్‌

  • మంత్రులు, కార్యదర్శులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విందు

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025 అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు విందు భేటీ నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన అవార్డు రాష్ట్రానికి, ప్రభుత్వానికి వచ్చిన గుర్తింపు అని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ‘టీమ్‌ ఏపీ’ స్పిరిట్‌తో పని చేయడం వల్లనే అవార్డు వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు నిర్వహిస్తున్న విందు... ‘డిన్నర్‌ విత్‌ విన్నర్స్‌’కు రావాలని మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌వోడీలను సీఎం పేరుపేరున ఆహ్వానిస్తున్నారు. రాజధానిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ ఈ విందు నిర్వహిస్తారు.

Updated Date - Apr 30 , 2026 | 03:22 AM