మే నెలలో సీబీఎస్ఈ రెండో విడత పది పరీక్షలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:26 AM
సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించబోయే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం.. అభ్యర్థుల జాబితా స్వీకరణ (ఎల్‌వోసీ) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.
న్యూఢిల్లీ, మార్చి 18: సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించబోయే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం.. అభ్యర్థుల జాబితా స్వీకరణ (ఎల్‌వోసీ) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31వరకు కొనసాగనుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండుసార్లు చేపట్టనున్నట్లు సీబీఎ్‌సఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని వారు తమ మార్కులను మెరుగు పరుచుకోవడానికి బోర్డు వెసులుబాటు కల్పించింది. అలాగే, ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో తప్పినవారు ఈ పరీక్షలు రాయవచ్చు. తాజా నిబంధనల ప్రకారం, ప్రధాన పరీక్షలకు హాజరైన వారు మాత్రమే రెండో బోర్డు పరీక్షకు అర్హులు. అయితే, మూడు అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయిన వారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షకే హాజరుకావాల్సి ఉంటుంది.