CBSE Launches Helpline to Support: 1800118004
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:00 AM
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు, ఒత్తిడిని అధిగమించి విజయం సాధించేందుకు సన్నద్ధమయ్యేలా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో....
విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి సీబీఎస్‌ఈ హెల్ప్‌లైన్.. 10-12వ తరగతి వారికి కౌన్సెలింగ్
న్యూఢిల్లీ, జనవరి 7: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు, ఒత్తిడిని అధిగమించి విజయం సాధించేందుకు సన్నద్ధమయ్యేలా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో సీబీఎ్‌సఈ 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. 1800118004 నెంబరుకు విద్యార్థులు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా మానసిక, పాఠ్యాంశాలకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా కౌన్సెలింగ్ పొందవచ్చని సీబీఎ్‌సఈ తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి థియరీ పరీక్షల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ఐవీఆర్‌ఎస్ ఫోన్ సేవలను ఈ నెల 6వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొంది. ఈ సేవలు 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.. ఈ ఏడాది జూన్ 1వ తేదీ వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చని. ఐవీఆర్‌ఎస్ సేవలు హిందీ, ఇంగ్లి్‌షలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఫోన్ సేవలకు 73 మంది నిష్ణాతులైన కౌన్సెలర్లను, ప్రిన్సిపాల్స్‌ను, సీబీఎ్‌సఈకి చెందిన విద్యావేత్తలను నియమించినట్టు పేర్కొంది.