సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నారాయణ’ జైత్రయాత్ర
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:20 AM
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు టాప్ మార్కులు సాధించారని నారాయణ స్కూల్స్ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ...
హైదరాబాద్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు టాప్ మార్కులు సాధించారని నారాయణ స్కూల్స్ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ గురువారం ప్రకటించారు. తమ విద్యార్థి, పంజాబ్‌కు చెందిన రిద్ది శర్మ 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నైతిక్ దంగి, బైజయంతి బెనర్జీ, మోహిప్ బోస్, మహారాష్ట్రకు చెందిన సానా సమీర్ గౌడ్, కర్ణాటకకు చెందిన సంజనా రెడ్డి, సజీవన్ 498 మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు అభినందించారు.
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విద్యార్థుల సత్తా
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ సంస్థకు చెందిన ఇద్దరు విద్యార్థులు 499 మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సీమ తెలిపారు. 9 మంది 498 మార్కులు, 19 మంది 497 మార్కులు, 41 మంది 496 మార్కులు, 59మంది విద్యార్థులు 495 మార్కులు సాధించారని పేర్కొన్నారు. 490 ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 268 మంది ఉన్నారని గురువారం ఆమె ఒక ప్రకటన చేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన అన్ని బ్రాంచిలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ పాఠశాలల్లో అమలుచేస్తున్న టెక్నో కరికులంతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. జేఈఈ, నీట్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారని డైరెక్టర్ సీమ వెల్లడించారు.
అగ్నిమాపక సిబ్బందికి కేంద్ర పురస్కారాలు
ఉత్తమ పనితీరుతో తెలంగాణ అగ్నిమాపకశాఖ సిబ్బంది జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వ సివిల్ డిఫెన్స్ పురస్కారానికి ఈ ఏడాది 10మంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్ ఇతర భద్రతా సంస్థల సిబ్బందిలో అత్యుత్తమ విధి నిర్వహణ, ధైర్యసాహసాలు, విశిష్ట సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలను అందజేస్తుంది. పురస్కారాలపై తెలంగాణ అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్‌మాన్ హర్షం వ్యక్తం చేశారు.