Share News

పది ఫలితాల్లో భాష్యం విద్యార్థుల సత్తా

ABN , Publish Date - May 01 , 2026 | 04:44 AM

పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

పది ఫలితాల్లో భాష్యం విద్యార్థుల సత్తా

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని మెయిన్‌ క్యాంప్‌సలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యార్థి దినేష్‌ 600 మార్కులకు 598 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచినట్టు వెల్లడించారు. అదే విధంగా కె.సాయికార్తీక్‌ 597, ఎన్‌వీ.శ్రీశ్రావ్య 597, టి.లోకేష్‌ 597, బి.ఇ.శార్వీ 596, బి.వి.యశశ్రీ 596, ఎం.మనోజ్ఞ 596, జి.లోహితాశ్రీ 596, జె.ఎ్‌స.సాయిఆదిత్య 596, కె.లాస్య 596 మార్కులు సాధించారని తెలిపారు. 590కి పైగా మార్కులు 214 మంది, 580కి పైగా 1108, 570కి పైగా 2293, 550కి పైగా 4253, 500కి పైగా 7515 మంది విద్యార్థులు సాధించారన్నారు. గణితంలో 100కు 100 సాధించిన విద్యార్థులు 1753, 95 ఆ పైగా 4824, 90 ఆ పైగా 6494 మంది, సైన్స్‌లో 100కు 100 సాధించిన విద్యార్థులు 464 మంది ఉన్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులను ఛైర్మన్‌ రామకృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాష్యం సాకేత్‌ రామ్‌ తదితరులు అభినందించారు.

Updated Date - May 01 , 2026 | 04:44 AM