Share News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Nov 10 , 2026 | 08:35 PM

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్- 2 పూర్తి స్థాయి నోటిఫికేషన్‌‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

అమరావతి, నవంబర్10: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 పూర్తి స్థాయి నోటిఫికేషన్‌‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 720 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ గ్రూప్-2 ఉద్యోగాలు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 11వ తేదీ.


2027 ఫిబ్రవరి 21వ తేదీన గ్రూప్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది ఆఫ్ లైన్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో జరిగే మెయిన్స్ పరీక్ష తేదీలను తర్వాత ఏపీపీఎస్సీ వెల్లడించనుంది.

ఎగ్జిక్యూటివ్ విభాగంలో..

  • డిప్యూటీ తహసీల్దార్: 203

  • డిప్యూటీ ఎంపీడీవో: 176

  • గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్: 40

  • ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ ఎస్సై: 29

  • నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో..

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 80

  • సీనియర్ అకౌంటెంట్: 91


అర్హత..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి..


null

Updated Date - Nov 10 , 2026 | 08:52 PM