ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 14 , 2026 | 05:03 AM
ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రీవెరిఫికేషన్...
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్‌బోర్డు బుధవారం విడుదల చేసింది. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా వివరాలు పొందవచ్చని పేర్కొంది. ఏవైనా వ్యత్యాసాలు, సాంకేతిక సమస్యలున్నా హెల్ డెస్క్(ఫోన్ నంబరు 9392911819)ను సంప్రదించాలని సూచించింది.
ఈఏపీసెట్‌కు రెండో రోజు 93.57 శాతం హాజరు
ఈఏపీసెట్ రెండో రోజు పరీక్షకు 93..57 శాతం మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 57,422 మంది విద్యార్థులకుగాను 53,727 మంది హాజరయ్యారని పేర్కొంది. ఉదయం సెషన్‌లో 93.48 శాతం, మధ్యాహ్నం సెషన్‌లో 93.66 శాతం మంది హాజరయ్యారని తెలిపింది.