జేఈఈ మెయిన్‌లో ‘అల్ఫోర్స్’కు ర్యాంకుల పంట
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:24 AM
ఐఐటీ-జేఈఈ మెయిన్-2026 పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ-జేఈఈ మెయిన్-2026 పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్‌లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యార్థి ఎం.శ్రీపార్థీష్ జాతీయస్థాయిలో 29వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలిచినట్లు చెప్పారు. 1000లోపు 14 ర్యాంకులు, 2000లోపు 18, 5000లోపు 35 ర్యాంకులు సాధించగా 450 మంది విద్యార్థులు ఐఐటీ (అడ్వాన్స్) పరీక్షకు అర్హత సాధించడం విశేషమన్నారు. పటిష ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల, కృషి ఫలితంగానే అల్ఫోర్స్ ఘన విజయాన్ని సాధించగలిగిందన్నారు.