ఏడాదిలో రెండుసార్లు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:38 AM
ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (ఏఐబీఈ)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
న్యూఢిల్లీ, జనవరి 20: ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ (ఏఐబీఈ)ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మంగళవారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. చివరి సంవత్సరం న్యాయ విద్యార్థులు ఏఐబీఈ రాసేందుకు వీలుగా నిబంధనలు రూపొందించినట్టు పేర్కొంది. ఏఐబీఈ న్యాయశాస్త్ర పట్టభద్రులు న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి ఉద్దేశించిన అర్హత పరీక్ష. తుది సెమిస్టర్ విద్యార్థులు కూడా ఏఐబీఈ రాసేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ 2024లో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్‌మెహతాల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏఐబీఈని ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నారని, ఎల్‌ఎల్‌బీ చివరి సెమిస్టర్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించనున్నట్టు బీసీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.