Share News

ఉజ్వల కెరీర్‌కు ఊతమిచ్చే ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 06:08 AM

రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌-లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధం యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నది తెలిసిందే. అందులో భాగంగా ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై ఆధారపడిన..

ఉజ్వల కెరీర్‌కు ఊతమిచ్చే ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌

శబ్దం విని బైటకు వచ్చి, చిన్న పిట్ట మాదిరిగా ఆకాశంలో వెళతున్న విమానాన్ని చూసి ఆనందించిన తరం ఒకప్పటిది. అయితే ఇప్పటి తరానికి విమానం కొత్తేమీకాదు. ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా ఎగువ మధ్యతరగతి పౌరులు విమానాల్లో ప్రయాణిస్తుండటం విశేషం. అందుకు మూలమైన ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ ఇప్పటి యువతకు ఒకానొక బెస్ట్‌ ఆప్షన్‌.

ష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌-లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధం యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నది తెలిసిందే. అందులో భాగంగా ఏరోస్పేస్‌ సిస్టమ్స్‌పై ఆధారపడిన డ్రోన్లు, శాటిలైట్లు, రాడార్‌ నెట్‌వర్క్స్‌, నిఘా విమానాలు, బాలిస్టిక్‌ క్షిపణులు, మానవరహిత కంబాట్‌ ఎయిర్‌ వెహికల్స్‌, ప్రెసిషన్‌-గైడెడ్‌ క్షిపణులు, సైబర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌బోర్న్‌ ప్లాట్‌ఫారమ్స్‌ సంబంధ విశేషాలను మీడియా ద్వారా తరచూ తెలుసుకుంటూనే ఉన్నాం. ఒక దేశ సరిహద్దు భద్రతలో వైమానిక దళం పోషిస్తున్న పాత్ర అలాగే అది అధునాతన వ్యవస్థలతో శత్రువులను ఢీకొంటున్న వైనం కూడా అర్థమవుతోంది కూడా. వాటి ఆధునీకరణలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ పాత్ర కీలకమని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

  • ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ ఒక్క రక్షణ రంగానికే పరిమితం కావటం లేదు. సివిల్‌, కమర్షియల్‌ రంగాల్లోనూ దీని పాత్ర పెరిగింది. ఏవియేషన్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ అప్లికేషన్స్‌, ఆటానమస్‌ ఫ్లయింగ్‌ వెహికల్స్‌కు తోడు పట్టణాల మధ్య ఎయిర్‌ మొబిలిటీ పెరిగింది.


  • ప్రపంచంలోని వివిధ పట్టణాల మధ్య దూరాన్ని విమానం తగ్గించేస్తోంది. అంటే ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా అందుకు దోహదపడుతోంది. ఒకప్పడు ధనికులకు మాత్రమే పరిమితమైన విమానయానం ఇప్పుడు ఎగువ మధ్యతరగతికి దగ్గరవుతోంది. గడచిన దశాబ్దంన్నర కాలంలో దేశీయంగా పెరిగిన విమానాశ్రయాలే అందుకు సాక్ష్యం. సరిగ్గా అదే దేశీయంగా విమాన రంగంలో సాంకేతిక పురోగతి సాధనను పురికొల్పుతోంది.

  • ఈ నేపథ్యంలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదవడం అంటే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నట్టే భావించాల్సి ఉంటుంది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, ఢిపెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియేషన్‌ పరిశ్రమలు, డ్రోన్‌ స్టార్టప్స్‌, స్పేస్‌ టెక్నాలజీ కంపెనీలు, ఢిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు, ఎయిర్‌బస్‌ - బోయింగ్‌ - గుడ్‌రిచ్‌ ఏరోస్పేస్‌ సిస్టమ్‌, సఫ్రాన్‌ ఏరోస్పేస్‌, టాటా అడ్వాన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌, క్యాప్‌జెమని, యూటీసీ ఏరోస్పేస్‌ సిస్టమ్‌, క్వెస్ట్‌, జీఈ అలాగే ఏవియేషన్‌లో ఎమర్జింగ్‌ రంగాలైన యూఏవీ టెక్నాలజీ - ఏఐ, రోబోటిక్స్‌, అటానమస్‌ సిస్టమ్స్‌, కంప్యుటేషనల్‌ డైనమిక్స్‌, శాటిలైట్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్న యువతకు మంచి వేతనంతో ఉపాధి లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలోకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

    డాక్టర్‌ మహ్మద్‌ అక్తర్‌ ఖాన్‌,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌,

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌,

గీతమ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌

Updated Date - Jun 29 , 2026 | 06:19 AM