12 కొత్త జూనియర్ కాలేజీలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:44 AM
రాష్ట్రంలో 12 కొత్త ప్రైవేటు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్ విద్యా బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది.
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 కొత్త ప్రైవేటు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్ విద్యా బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. 12 గ్రామీణ మండలాల్లో ఈ కాలేజీలు ఏర్పాటుచేయనున్నారు. కాలేజీ భవనాలను జియోట్యాగింగ్ చేసి ఆ ఫొటోలు, సంబంధిత పత్రాలతో ఏప్రిల్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. జియో ట్యాగింగ్ ఫొటోలు లేని దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టంచేసింది.