Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27-07-2026

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:57 AM

‘గునుగుపూలు’ ఆత్మకథనం, ‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ, ‘బ్లాక్‌ రెయిన్‌బో’ కథా సంపుటి, మినీ కథల పోటీ

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27-07-2026

‘గునుగుపూలు’ ఆత్మకథనం

జూపాక సుభద్ర ఆత్మకథనం ‘గునుగుపూలు’ ఆవిష్కరణ సభ జూలై 27 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. అధ్యక్షత పసునూరి రవీందర్; పుస్తకావిష్కర్త పోలీసు కాల్పుల బాధిత బెల్లంపల్లి దుర్గక్క; తొలి ప్రతి స్వీకర్త బాణాల సాలమ్మ; ఆత్మీయ అతిథులు తాళ్లపల్లి యాకమ్మ, కోట విజయ, మారోజు దేవేంద్ర, రచన ముద్రబోయిన తదితరులు.

కృపాకర్ మాదిగ

‘రంగులూ, ఫిరంగులూ’ పుస్తకావిష్కరణ

రావిశాస్త్రిగారి రచనల్లో ఎంపిక చేసిన వచనఖండికలతో ఎ.వి. రమణమూర్తి సంకలనం చేసిన ‘రాచకొండ విశ్వనాథశాస్త్రి: రంగులూ, ఫిరంగులూ’ పుస్తకం ఆవిష్కరణ సభ జూలై 30 సా. 6 గంటలకు ప్రెస్ క్లబ్, బషీర్‌బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త ‘మనసు’ రాయుడు, అధ్యక్షత వాసిరెడ్డి నవీన్, వక్తలు మృణాళిని, ఎన్. వేణుగోపాల్, జి.ఎస్. చలం. వివరాలకు: 98660 22150.

ఎ. వి. రమణమూర్తి,

‘బ్లాక్‌ రెయిన్‌బో’ కథా సంపుటి

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కెంగార మోహన్ దళిత కథా సంపుటి ‘బ్లాక్ రెయిన్‌బో’ ఆవిష్కరణ ఆగస్టు 2 ఉ.10గంటలకు కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఆవి‌ష్కర్త గుంటూరు లక్ష్మీ నరసయ్య, వక్తలుగా జి. వెంకట కృష్ణ, పసునూరి రవీందర్, గంధం అరుణ, మారుతీ పౌరోహితం పాల్గొంటారు. వివరాలకు 94933 75447.

ఆవుల బసప్ప

మినీ కథల పోటీ

కామకోటి రాఘవరావు స్మారకంగా లక్ష్మీరాఘవ సహకారంతో విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఆధ్వర్యంలో జరిగే మినీ కథల పోటీకి మొదటి, రెండవ బహుమతులు వరుసగా– రూ.3000, రూ.2000. మూడవ బహుమతి ఒక్కో కథకు రూ.1000 చొప్పున పది కథలకు ఇస్తాం. మూడు పేజీల లోపు కథను, హామీ పత్రంలో మాత్రమే మీ వివరాలు రాసి, ఈమెయిల్‌: ethakotas@yahoo.comకు పంపాలి. వివరాలకు 94404 65797.

ఈతకోట సుబ్బారావు

Updated Date - Jul 27 , 2026 | 02:57 AM