Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 05 2026

ABN , Publish Date - May 11 , 2026 | 12:55 AM

‘మరచిపోకుమా’ కవిత్వం, ‘నీటికుండ లాంటి మనిషి’ కవిత్వం, చందు లిటరరీ అవార్డు, ఆటా నవలల పోటీ, కథలకు, కవిత్వ సంపుటాలకు ఆహ్వానం, పీచర సునీత రావు అవార్డులు, కవితా పఠనం

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 05 2026

‘మరచిపోకుమా’ కవిత్వం

రొడ్డ సురేంద్ర కవిత్వ సంపుటి ‘మరచిపోకుమా’ ఆవిష్కరణ సభ మే 15 సా.5గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, బైరాగిపట్టెడ, తిరుపతిలో జరుగుతుంది. అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథి జెల్ది విద్యాధర్ రావు.

తిరుపతి రచయితల సంఘం

‘నీటికుండ లాంటి మనిషి’ కవిత్వం

సుంకర గోపాలయ్య కవిత్వ సంపుటి ‘నీటికుండ లాంటి మనిషి’ ఆవిష్కరణ సభ మే 17 సా.6 గంటలకు విజయనగరం గురజాడ గృహంలో జరుగుతుంది. యాకూబ్, కొప్పర్తి, అట్టాడ అప్పల నాయుడు, గంటేడ గౌరునాయుడు, పుప్పాల శ్రీరామ్ పాల్గొంటారు.

పాయల మురళీకృష్ణ

చందు లిటరరీ అవార్డు

చందు సుబ్బారావు లిటరరీ ట్రస్ట్ అవార్డుకు జర్నలిస్టు, రచ యిత తాడి ప్రకాష్‌ ఎంపిక య్యారు. అవార్డు ప్రదానం మే 18 ఉ.10 గంటలకు విశాఖపట్నం ద్వారకా నగర్‌లోని పౌర గ్రంథాలయంలో జరుగుతుంది. అధ్యక్షత ప్రొఫెసర్ చలం; అతిథులు అట్టాడ అప్పలనాయుడు, జి.ఎస్. చలం, వి.వి. రమణ మూర్తి.

ఉప్పల అప్పలరాజు

ఆటా నవలల పోటీ

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం రెండు లక్షల రూపాయలను బహుమతులతో నిర్వహిస్తున్న నవలల పోటీకి అచ్చులో కనీసం 150 పేజీలు వచ్చే తెలుగు నవలలను డిటిపి చేసి ఈ మెయిల్‌: ata.abeditor@ gmail.com కు జూన్ 30 లోపు పంపాలి. హమీ పత్రంపై మాత్రమే రచయిత చిరునామా, వివరాలు ఉండాలి.

వేణు నక్షత్రం

కథలకు, కవిత్వ సంపుటాలకు ఆహ్వానం

ఖమ్మం ఈస్తటిక్స్ కథలను, కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తుంది. మూడు ఉత్తమ కథలకు మొదటి, రెండో, మూడో బహుమతులు వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలు; ఉత్తమ కవితా సంపుటికి రూ.40వేలు. కవితా సంపుటి 2025 ఏప్రిల్ – 2026 మార్చ్ నడుమ ప్రచురితమై, కనీసం 25 కవితలకు తగ్గకుండా ఉండాలి, నాలుగు ప్రతులను పంపాలి. కథలు ఈ పురస్కారం కోసం రాసినవై ఉండాలి. కథ ప్రింట్ కాపీల ప్రతులను పోస్ట్‌కు పంపుతూ, యూనికోడ్ సాఫ్ట్ కాపీని మెయిల్‌ చేయాలి. ఆగస్ట్‌ 31లోగా పోస్ట్‌ చేయాల్సిన చిరునామా: ఖమ్మం ఈస్తటిక్స్‌, హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఇం.నెం: 5–7–200/11, పాకబండ బజార్‌, ఖమ్మం – 507002. ఫోన్‌: 98491 14369.

రవి మారుత్

పీచర సునీత రావు అవార్డులు

పీచర సునీత రావు 2026 పురస్కారాల్లో కవితా విభాగానికి బాణాల శ్రీనివాసరావు; కథా విభాగంలో జి. ఉమామహేశ్వర్ రావు, స్వర్ణ కిలారి; విమర్శలో బండారి రాజకుమార్‌, కె.పి. అశోక్ కుమార్ ఎంపిక అయ్యారు. మే 24 సా.5.30గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరిగే సభలో విజేతలకు రూ.15వేల నగదు పురస్కారం, సత్కారం ఉంటుంది.

పీచర విజయేందర్ రావు

కవితా పఠనం

మరువం – లామకాన్ కలిసి నిర్వహిస్తున్న 3వ ‘ధ్వని’ ​(నిండైన శ్రవ్య–రూప అనుభవం) కార్య క్రమంలో భాగంగా ‘రాత్రులు మొదలయ్యే వేళ...’ పేరుతో సిద్ధార్థ (‘కవివాగ్గేయ’) కవితా పఠనం మే 14 సా. 6.30 నుండి లామకాన్, జివికె మాల్ ఎదురు సందులో, రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది.

సుమనస్పతిరెడ్డి

Updated Date - May 11 , 2026 | 12:55 AM