ఈ వారం వివిధ కార్యక్రమాలు 30 03 2026
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:16 AM
‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంపుటి, శంభూక అవార్డు ప్రదానం, ‘ఉప్పు మూట’ బాలల కథలు, వాసా ప్రభావతి కవితల పోటీ...
‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంపుటి
వారాల ఆనంద్ తెలుగులో రాసి తానే ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘మానేరు తీరం’ ద్విభాషా కవితా సంపుటి ఆవిష్కరణ మార్చ్ 30 సా.5 గంటలకు కరీంనగర్ పట్టణ కంఠాభరణం అయిన మానేరు నది ఒడ్డున దిగువ మానేరు ఆనకట్టపై జరుగుతుంది. కరీంనగర్‌కు చెందిన పలువురు సాహితీవేత్తలు, ఆత్మీయులు హాజరవుతారు.
వి. ఇందిరా రాణి
శంభూక అవార్డు ప్రదానం
కుల నిర్మూలనోద్యమం కోసం సాహిత్య, సామాజిక రంగాల్లో విలువైన కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే ‘శంభూక అవార్డు’, 2026కు గాను పసునూరి రవీందర్ స్వీకరిస్తారు. అవార్డు ప్రదానోత్సవ సభ ఏప్రిల్ 1 సా.5గం.లకు మంగళగిరి సమీపంలోని నిడమర్రులో ప్రత్తిపాటి మల్లేశ్వరరావు స్థూపం ప్రాంగణంలో జరుగుతుంది. అధ్యక్షత జి.లక్ష్మీనర్సయ్య, వక్తలు కోయి కోటేశ్వరరావు, గుండిమెడ సాంబయ్య, కాకాని సుధాకర్, జిలుకర శ్రీనివాస్. వివరాలకు: 99893 01351.
శంభూక అవార్డు కమిటీ
‘ఉప్పు మూట’ బాలల కథలు
తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆసూరి ఉషారాణి రచన ‘ఉప్పు మూట దూది మూట’ బాలల బొమ్మల కథల సంపుటి తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులో ఏప్రిల్ 3 ఉ.10గంటలకు జరుగుతుంది. తోట వెంకటేశ్వర్లు, పెంచల కిషోర్, గంగిశెట్టి శివకుమార్, నడింపల్లి సత్యనారాయణ రాజు, సి.ఎన్.చంద్రశేఖర్, గరికపాటి రమేష్ బాబు పాల్గొంటారు. వివరాలకు: 9393662821.
ఆర్సీ కృష్ణస్వామి రాజు
వాసా ప్రభావతి కవితల పోటీ
వాసా ఫౌండేషన్–పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో వాసా ప్రభావతి స్మారకార్థం నిర్వహించే కవితల పోటీలో మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.3 వేలు, రూ.2వేలు, రూ .1000. ఎనిమిది కవితలు ఒక్కొక్క కవితకు రూ. 500 ప్రత్యేక బహుమతులు. ఎక్కడా ప్రచురితం కాని కవితలను ఏప్రిల్ 30లోపు చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం: 3, బ్లాక్–6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్–500044, ఫోన్: 984 87 87284కు పంపాలి. ఈమెయిల్: palapittamag@gmail.com.
గుడిపాటి
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్