ఈ వారం వివిధ కార్యక్రమాలు 26-10-2026
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:14 AM
‘సమూహ’ యువ సాహిత్యోత్సవం, బలివాడ కాంతారావు శతజయంతి సభ, సప్తతి సభ...
‘సమూహ’ యువ సాహిత్యోత్సవం
సమూహ యువ సాహిత్యోత్సవం 2026 కార్యక్రమం అక్టోబరు 31 ఉ.9.30 నుంచి సా.7.30వరకు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో జరుగుతుంది. గత సంవత్సరం లాగానే ‘గోడల్ని ఛేదిద్దాం’ (వర్డ్స్ ఎగైనెస్ట్ వాల్స్) కేంద్ర విషయంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ‘సంస్కృతి–ఆధిపత్య వ్యవస్థలు’, ‘డిజిటల్ మాధ్యమాలు–అసమ్మతి స్వరాలు’, ‘కొత్తతరం–సాహిత్య స్వరం’, ‘చదువుల మేనిఫెస్టో–మేమెక్కడ?’, ‘ప్రదర్శన కళలు–సామాజిక మార్పు’ పేర్లతో అయిదు సమా వేశాలు ఉంటాయి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సూర్యా ధనంజయ్, స్కై బాబా, జి.ఎస్. రామ్మోహన్, వినోదిని, కె.వి. కూర్మనాథ్, తులసి చందు, వేణు ఉడుగుల, మెర్సీ మార్గ రెట్ తదితరులు పాల్గొంటారు. సాయంత్రం ఆర్. సీతారాం, గాజోజు నాగభూషణం, రూపరుక్మిణి యువ కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నలభైమంది దాకా యువ కవులు పాల్గొంటారు. సంప్రదించాల్సిన నంబర్లు: 90528 09952, 98480 98333.
సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరమ్
బలివాడ కాంతారావు శతజయంతి సభ
సాహిత్య అకాడమీ – రైటర్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో బలివాడ కాంతారావు శత జయంతి సభ అక్టోబరు 31 ఉ.10 గం.ల నుంచి పౌర గ్రంథాలయం హాల్ 1, ద్వారకానగర్, విశాఖ పట్నంలో జరుగుతుంది. సభలో షణ్ముఖానంద, వి.వి. రమణమూర్తి, ద్విభాష్యం రాజేశ్వరరావు, సి. మృణాళిని, సుజాత పట్నాయక్, చింతకింది శ్రీనివాసరావు, అశోక్ బలివాడ, నండూరి రాజగోపాల్, ఎన్.కె. బాబు, మేడా మస్తాన్ రెడ్డి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి తదితరులు పాల్గొంటారు. సాహిత్య అకాడమీ పుస్తక ప్రదర్శన ఉంటుంది.
సాహిత్య అకాడమీ
సప్తతి సభ
కవి సంధ్య – తెలుగు శాఖ, డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ, యానాం సంయుక్త నిర్వహణ లోకవి శిఖామణి సప్తతిసభ నవంబర్ 1 ఉ.9.30 నుంచి సా.4.30 వరకు యానాంలో జరుగుతుంది. శిఖామణి కవిత్వంపై సదస్సులు; కవి సంధ్య పురస్కార ప్రదాన సభ; కవి సంధ్య డిజిటల్ సంచికలు, కవి సంధ్య 62– సప్తతి ప్రత్యేక సంచిక, మనవడి పద్యాలు ఆవిష్కరణ ఉంటాయి. సభలో బేతవోలు రామబ్రహ్మం, దొండపాటి నాగజ్యోతి, మల్లాడి కృష్ణారావు, మన్నం రాయుడు, ఖాదర్ మోహియుద్దీన్, దాట్ల దేవదానం రాజు, చల్లపల్లి స్వరూప రాణి, ప్రసాద మూర్తి, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9848202526.
వరుగు భాస్కర్ రెడ్డి
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..