ఈ వారం వివిధ కార్యక్రమాలు 23 02 2026
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:47 AM
మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కార ప్రదానోత్సవం, ‘లవ్ జిహాద్’ అనువాద పుస్తకం ఆవిష్కరణ, మూడు పుస్తకాల పరిచయ సభ, భూతపురి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం, కథ, కవితా సంపుటాలకు ఆహ్వానం, ఉమ్మడిశెట్టి అవార్డు విజేత ప్రకటన, ‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మూడవ సమావేశం...
మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కార ప్రదానోత్సవం
మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కార ప్రదాన సభ ఫిబ్రవరి 25 సా.5.30గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. 2025కు గాను ‘గస్సాల్’ కథా సంపుటికి కటుకోజ్వల ఆనందాచారి, 2026కు గాను ‘ఉలిపికట్టెలు’ కథా సంపుటికి పి. జ్యోతి పురస్కారాలను స్వీకరిస్తారు. సభలో నాళేశ్వరం శంకరం, నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, సమ్మెట ఉమాదేవి, రూప రుక్మిణి తదితరులు పాల్గొంటారు.
మాడభూషి లలిత
‘లవ్ జిహాద్’ అనువాద పుస్తకం ఆవిష్కరణ
శ్రీనివాసన్ జైన్, మరియం అలావి, సుప్రియా శర్మ రాసిన ‘లవ్ జిహాద్’ పుస్తకానికి రవి నర్ల తెలుగు అనువాదం ఆవిష్కరణ ఫిబ్రవరి 28 సా.5.30 గంటలకు బషీర్‌బగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో ఘంటా చక్రపాణి, బి. సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసన్ జైన్, కల్పనా కన్నబిరన్ తదితరులు పాల్గొంటారు.
మలుపు ప్రచురణలు
మూడు పుస్తకాల పరిచయ సభ
వి.ఆర్. రాసాని ఈ మధ్య రాసిన మూడు పుస్తకాల పరిచయ సభ ఫిబ్రవరి 28 ఉ.10గంటలకు సెనేట్‌హాల్, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో జరుగుతుంది. సభలో బి.వి.ముళీధర్, నరసింగరావు, ఎం. భూపతినాయుడు తదితరులు పాల్గొంటారు. ఆకుల మల్లేశ్వరరావు, నాగోలు కృష్ణారెడ్డి, మేడిపల్లి రవికుమార్, కొత్వాలు అమరేంద్ర పుస్తకాలను పరిచ యం చేస్తారు. బాలా బుక్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఉంటుంది.
పి. వివేక్
భూతపురి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం
భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 89వ జయంతి సందర్భంగా 24వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం భూతపురి సుబ్రహ్మణ్యశర్మ మెమోరియల్ ట్రస్ట్ & అల్లసాని పెద్దన సాహిత్యపీఠం ఆధ్వర్యంలో మార్చి 1 ఉ.10గంటలకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడపలో జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు కె. సర్వోత్తమరావు పురస్కారాన్ని అందుకుంటారు. ఆయనకు రూ.10,116/– నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడుతుంది. సభలో బొమ్మిరెడ్డి జయరామిరెడ్డి, బెల్లంకొండ రాజశేఖర్, జి. దామోదర నాయుడు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9966624276.
భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి
కథ, కవితా సంపుటాలకు ఆహ్వానం
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. కవులు, కథకులు 2025 లో వెలువడిన కథ, కవితా సంపుటాలు మూడు ప్రతులను మార్చ్ 31లోపు కింది చిరునామా: నానా, ఇం.నెం: 63–5–596, ఎన్.ఎన్.ఆర్ నిలయం, బాలాజీనగర్ 3/4, పాత గుంటూరు, గుంటూరు–522001 ఫోన్: 9849139337కు పంపాలి.
ఎస్.ఎం సుభాని
ఉమ్మడిశెట్టి అవార్డు విజేత ప్రకటన
38వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు -2025కు కంచరాన భుజంగరావు కవితా సంపుటి ‘గీసి చెరిపే బొమ్మ’ ఎంపికైంది. ఇది వీరి రెండవ కవితా సంపుటి. న్యాయనిర్ణేతలు వసీరా, కోయి కోటేశ్వరరావు, కోడూరి విజయకుమార్‌లకు కృతజ్ఞతలు. ప్రదాన సభా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
ఉమ్మడిశెట్టి రాధేయ
చిన్ని నారాయణరావు అవార్డు విజేత ప్రకటన
చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ఈ ఏడాదికి సాహితీ అవార్డుల విజేతలను ప్రకటించింది. ప్రధాన అవార్డుకు కొప్పర్తి వెంకటరమణమూర్తి ఎంపికయ్యారు. మరో మూడు అవార్డులకు పిడుగురాళ్ళకు చెందిన వై.హెచ్.కె.మోహనరావు (సత్యవేటి శ్రీకాంత్ స్మారక పురస్కారం), మద్దూరి శ్రీనివాసులు (తుంగా రాజగోపాలరెడ్డి స్మారక పురస్కారం), గంగవరపు సునీత (నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కారం) ఎంపికయ్యారు. వివరాలకు: 9246415150.
కలిమిశ్రీ
‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మూడవ సమావేశం
‘ఎరిక: కళింగ సాహిత్య పాఠశాల’ మూడవ సమావేశం మార్చి 2న విజయనగరం జిల్లా వేణుగోపాలపురంలో ఉన్న జిల్లావిద్యాశిక్షణా కేంద్రంలో జరుగుతుంది. ‘చిత్రకళ–స్థానికత’ అంశంపై చిత్రకారులు చందనపల్లి గోపాలరావు ఉపాధ్యాయ శిక్షణార్థులుతో మాట్లాడుతారు. ఈ సభలో ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు, అధ్యాపకులు ఎం.రమేష్, ఎం. మురళి, వి. చిన్నంనాయుడు, డి. శ్రీనివాసరావు, కె. అప్పారావు, జి. సూరిబాబు, సిహెచ్. సోమయాజులు తదితరులు పాల్గొంటారు.
బాలసుధాకర్