ఈ వారం వివిధ కార్యక్రమాలు 22-06-2026
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:22 AM
‘రెప్పలు దాటని లోకం’ కవిత్వ సంపుటి, నలిమెల బుచ్చమ్మ – రామచంద్రం స్మారక పురస్కారం, ధ్వని శ్రవ్య–రూప ప్రదర్శన, పెన్నా సాహిత్య పురస్కారం, సాహిత్య సమ్మేళనం
‘రెప్పలు దాటని లోకం’ కవిత్వ సంపుటి
ఎన్. గోపి కవిత్వ సంపుటి ‘రెప్పలు దాటని లోకం’ ఆవిష్కరణ జూన్ 25 సా.6గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో కె.వి. రమణాచారి, ఆశారాజు, ఏనుగు నరసింహారెడ్డి, ఎస్. రఘు, కుడికాల వంశీధర్, గిన్నారపు ఆదినారాయణ తదితరులు పాల్గొంటారు.
కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్
నలిమెల బుచ్చమ్మ – రామచంద్రం స్మారక పురస్కారం
బహుభాషావేత్త నలిమెల భాస్కర్ తన తల్లిదండ్రుల పేర ప్రారంభిస్తున్న నలిమెల బుచ్చమ్మ–రామచంద్రం స్మారక పురస్కారాన్ని తొలిసారిగా అన్నవరం దేవేందర్ స్వీకరిస్తారు. పురస్కార ప్రదా నం జూన్ 28 ఉ.10 గంటలకు ఫిలిం భవన్, కరీంనగర్‌లో జరుగుతుంది. ఎన్. గోపి, ఎస్. రఘు, గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, రవి ఠాకూర్, నగునూరి శేఖర్ తదితరులు పాల్గొంటారు.
సాహితీ సోపతి
ధ్వని శ్రవ్య–రూప ప్రదర్శన
‘ధ్వని’ శ్రవ్య–రూప ప్రదర్శన కార్యక్రమంలో భా గంగా కవి ఖాదర్ మొహియుద్దీన్ కవిత్వ పఠనం జూన్ 25 సా.6.15 గంటల కు లామకాన్, జివికె మాల్ ఎదురు సందు, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది.
సుమనస్పతి రెడ్డి
పెన్నా సాహిత్య పురస్కారం
పెన్నా సాహిత్య పురస్కారం 2026 కు గాను 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు ముద్రించ బడిన కవితా సంపుటాలు 4 కాపీలను జూలై 10 లోపు చిరునామా: అవ్వారు శ్రీధర్ బాబు, ఇ.నెం. 23–1–57, పెండెం వారి వీధి, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు–524003కు పంపాలి. వివరాలకు ఫోన్: 85001 30770.
అవ్వారు శ్రీధర్ బాబు
సాహిత్య సమ్మేళనం
‘సాహిత్య సమ్మేళనం – 2026’ కార్యక్రమం జులై 11, 12 తేదీల్లో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేం ద్రం, ఆకులవారి వీధి, విజయవాడలో జరుగుతుం ది. సమకాలీన సాహిత్య అంశాలపై కవులు, రచయితలు, విమర్శకులు ప్రసంగిస్తారు. రాచపాళెం, తెలకపల్లి రవి, ఖాదర్ మొహియుద్దీన్, జి. లక్ష్మీనరసయ్య, కోయి కోటేశ్వరరావు, అట్టాడ అప్పలనాయుడు, ఖదీర్ బాబు, ఆర్. సీతారాం తదితరులు పాల్గొంటారు. పాల్గొనదలచినవారు పేర్లు నమోదు చేసుకోవాల్సిన నంబర్లు: 99515 40671, 94900 98022.
సాహిత్య స్రవంతి