Share News

ప్రకృతి విపత్తుపై రాజకీయం ఏమిటి?

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:00 AM

ప్రస్తుతం తెలంగాణ సమాజం తీవ్రమైన వర్షాభావం, ఊహించని ఎల్‌నినో వాతావరణ పరిణామాల వల్ల భయంకరమైన నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఎదుర్కొనే ప్రమాదంలో పడింది.

ప్రకృతి విపత్తుపై రాజకీయం ఏమిటి?

ప్రస్తుతం తెలంగాణ సమాజం తీవ్రమైన వర్షాభావం, ఊహించని ఎల్‌నినో వాతావరణ పరిణామాల వల్ల భయంకరమైన నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఇది కేవలం ప్రకృతి సృష్టించిన గ్లోబల్ వైపరీత్యమని తెలిసీ, ఈ ప్రతికూల పరిస్థితులకు ప్రభుత్వంపై నెపం నెడుతూ బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ‘కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని విషప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమైన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎల్‌నినో అనేది మానవుల చేతుల్లో లేని అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థ మార్పు. మానవ ప్రమేయం లేకుండా వానలు పడకపోవడం ప్రకృతి శాపం కాదా? అలాగే, విద్యుత్ డిమాండ్ ఏకంగా 20,000 మెగావాట్లకు చేరడం, చలికాలంలో వేసవిని తలపించేలా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం నిజమే కదా! ముఖ్యమంత్రి ఆ ధైర్యం చేసి, దాచకుండా నిజాన్ని ప్రజల ముందుంచారు. ప్రభుత్వం సంక్షోభ నివారణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు ప్రారంభించింది. ప్రతిపక్షాలు తమ సంకుచిత రాజకీయ స్వార్థాన్ని, బురదజల్లే నైజాన్ని పక్కనబెట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇది రాజకీయం చేసే సమయం కాదు.

- వెంకగారి భూమయ్య

Updated Date - Oct 17 , 2026 | 01:02 AM