Share News

వాటికి ప్రత్యేక క్యాలెండర్‌ అవసరం!

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:56 AM

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెలవు దినాలు, ఐచ్చిక సెలవులు తెలియ జేస్తూ గెజెట్ ద్వారా ఒక ప్రకటన జారీ చేస్తుంది.

వాటికి ప్రత్యేక క్యాలెండర్‌ అవసరం!

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెలవు దినాలు, ఐచ్చిక సెలవులు తెలియ జేస్తూ గెజెట్ ద్వారా ఒక ప్రకటన జారీ చేస్తుంది. స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి వాటితో పాటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండుగలకు సెలవులు ప్రకటిస్తుంది. గత ఐదు సంవత్సరాల నుంచి ప్రముఖుల జన్మదినాల పేరుతో రాష్ట్ర పండుగ జరుపమని అనేక మంది వ్యక్తుల పేర్లను ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఒక విధంగా ఇది వేలం వెర్రిగా మారింది. పైగా ఓట్ల కోసం వ్యక్తుల జన్మదినాలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో జాబితా పెరిగిపోతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు ఆ ఫోటోకి దండ వేసి అధికారులు రాష్ట్ర పండుగ అయింది అని అనిపిస్తున్నారు. జాతిని జాగృతి చేసి, దేశానికీ, రాష్ట్రానికి సేవలు చేసిన వారిని తప్పక గుర్తించాలి. పాఠశాల విద్యార్థులకు వారి గురించి వివరించడం మంచిదే. అయితే రాష్ట్ర పండుగలు ఎవరికి జరపాలి అని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక క్యాలెండరు రిలీజు చేయాలి... లేదంటే అధికారులు మరిచిపోయే ప్రమాదం ఉంది.

- మారిశెట్టి జితేంద్ర

Updated Date - Oct 10 , 2026 | 12:58 AM