Share News

స్మార్ట్‌ఫోన్లతోనే అనర్థాలు!

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:24 AM

సోషల్ మీడియా ప్రభావం వల్ల టీనేజ్‌లోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి‌ పెరిగిపోతోంది. జల్సాల మాయలో, విలాస‌ వస్తుసామగ్రి తేలికగా పొందాలని, ఈ మధ్య కొందరు యువకులు హత్యలు, అత్యాచారాలకు..

స్మార్ట్‌ఫోన్లతోనే అనర్థాలు!

సోషల్ మీడియా ప్రభావం వల్ల టీనేజ్‌లోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి‌ పెరిగిపోతోంది. జల్సాల మాయలో, విలాస‌ వస్తుసామగ్రి తేలికగా పొందాలని, ఈ మధ్య కొందరు యువకులు హత్యలు, అత్యాచారాలకు సైతం పాల్పడే స్థితికి పతనమయ్యారు. స్మార్ట్ ఫోన్లు, చౌక ఇంటర్నెట్ వల్ల యువత యూట్యూబుల్లో అశ్లీల, నేర సంబంధ వీడియోలు చూస్తూ సైకోలుగా మారుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు కేంద్ర ప్రభుత్వం ఏ దేశంలో లేని విధంగా అతి చౌకగా ఇంటర్నెట్ అందిస్తోంది. ఆ భరోసాతో యువత గంటలకొద్దీ చాటింగ్ చేస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. పెరుగుతున్న ఈ దుశ్చర్యలనీ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చైనా, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాలు 16 ఏళ్ళ లోపు యువత స్మార్ట్ ఫోన్ చూడరాదని చట్టం చేశాయి. మన ప్రభుత్వం కూడా అలాంటి చట్టం చేసి, అపరిమితంగా మాట్లాడే కాల్స్‌ని, ఉచిత చాటింగ్‌లని కుదించాలి. అంతేగాక సామాన్యులు నిత్యం వాడుకునే ఇంటర్నెట్ లేని చిన్న సెల్ ఫోన్లని పునరుద్ధరిస్తే మేలు.

– తిరుమలశెట్టి సాంబశివరావు, గుంటూరు

Updated Date - Aug 25 , 2026 | 12:25 AM