సిగాచీ కార్మికులకు న్యాయం కోసం సభ
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:03 AM
సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో మరణించిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇంకా అందలేదు.
సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో మరణించిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇంకా అందలేదు. గాయపడిన కార్మికులకు కూడా సరైన వైద్యం అందడం లేదు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల షోయబ్ హాల్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమావేశం జరుగుతుంది. సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, టీపీ జేఏసీ, హెచ్‌ఆర్‌ఎఫ్, ఎన్‌ఏపీఎం, ఏపీసీఆర్, ఇతర ప్రజా, పౌర వేదికలు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్, పర్యావరణవేత్త డాక్టర్ కె.బాబూరావు, కె.జీవన్ కుమార్, ఎన్‌ఏపీఎం నాయకులు మీరా సంఘమిత్ర, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్, పాశం యాదగిరి, డాక్టర్ నారాయణరావు, ఇ.ఆర్.కొండలరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఐఎఫ్‌టియు కె.అనురాధ, టీయూసీఐ నాయకులు ఎస్‌ఎల్ పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలరాజు, కుల అసమానతల నిర్మూలనా వేదిక నాయకులు బండారి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పి.శంకర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్, తదితరులు పాల్గొంటారు.
– కన్నెగంటి రవి, కో కన్వీనర్, టీపీ జేఏసీ