Share News

ప్రొ. జయశంకర్‌ 15వ స్మారకోపన్యాసం

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:17 AM

స్వీయ అస్తిత్వం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం తెలంగాణ అసంఖ్యాక బలిదానాలను చేసింది. మూడు తరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సర్. స్వరాష్ట్రంలో..

ప్రొ. జయశంకర్‌ 15వ స్మారకోపన్యాసం

స్వీయ అస్తిత్వం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం తెలంగాణ అసంఖ్యాక బలిదానాలను చేసింది. మూడు తరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సర్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక స్వేచ్ఛ సాధించుకుంటారని, తెలంగాణ చారిత్రక స్ఫూర్తి పునాదిగా అధికారాన్ని ప్రజలు నియంత్రిస్తారని ఆయన భావించారు. అలాగే, తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా అంతర్గత దోపిడీ విధానాలు కొనసాగుతాయని, నిరంతరం పోరాటం చేయగలిగే చైతన్యవంతమైన పౌర సమాజం తెలంగాణలో ఎల్లకాలం ఉండాలని విశ్వసించారు. 2004లో ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం వారి అధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రసాధనలో కీలకపాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్వయంపాలన పేరు మీద గత పాలకులు చేసిన మోసాలను విప్పిచెప్పింది. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలను, విధ్వంసక అభివృద్ధి నమూనాపై అంతేస్థాయిలో పోరాడుతున్నది. మరోవైపు తరాలుగా పోగుచేసుకున్న మహత్తర భారతీయభావనను చిదిమివేస్తూ బహుళత్వ భారతదేశాన్ని అసహన సమాజంగా మార్చివేయడం కోసం కేంద్రపాలకులు ప్రయత్నిస్తున్నారు. ఈ పాలనా విధానాలను ఎదురిద్దాం. అందులో భాగంగానే నవంబర్ 15న హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 1.00 గంటకు జయశంకర్ సర్ 15వ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నాం. ‘ప్రజాస్వామ్య పునరుజ్జీవనం–సవాళ్లు: భారతదేశ అనుభవాలు’ అనే అంశంపై ప్రముఖ జర్నలిస్టు, ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ్‌ వరదరాజన్‌ ఉపన్యసిస్తారు. సీనియర్ జర్నలిస్టు ఉమా సుధీర్‌, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

- అంబటి నాగయ్య

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - Nov 14 , 2026 | 01:19 AM