New Dress Code for Doctors: కొత్తపలుకు
ABN , Publish Date - Jan 04 , 2026 | 02:52 AM
మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్ కోడ్ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్ ప్యాంట్, టీ షర్టులు వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించకూడదు.....
మన దేశంలో వైద్య వృత్తిలో ఉన్న వారికి భారతీయ వైద్య మండలి డ్రెస్ కోడ్ నిర్ణయించింది. పురుషులైతే జీన్స్ ప్యాంట్, టీ షర్టులు వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించకూడదు. మహిళలైతే మితి మీరిన అలంకరణ చేసుకోకూడదు. గోళ్లు పెంచుకొని నెయిల్ పాలిష్ వేసుకోకూడదన్న నిబంధనలూ ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రోగులకు వైద్యులపై గౌరవ భావం ఏర్పడాలి. వైద్యో నారాయణో హరిః అంటారు. అంటే వారిలో దేవుడిని మాత్రమే రోగులు చూడాలన్న ఉద్దేశంతో ఇలాంటి నియమ నిబంధనలు పెట్టారు. యాప్రాన్ ధరించి కనపడే వైద్యుల పట్ల మనకు తెలియకుండానే గౌరవ భావం ఏర్పడుతుంది.న్యాయమూర్తులకూ డ్రెస్ కోడ్ ఉంది. న్యాయమూర్తులను చూడగానే లేచి నిలబడి గౌరవించాలన్న ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పెట్టి ఉంటారు. వస్త్రధారణ విషయంలో మాకు స్వేచ్ఛ లేదా అని న్యాయమూర్తులు, వైద్యులు వంటి ఉన్నత వృత్తుల్లో ఉన్నవారు చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.